రేపు పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి పొన్నం ప్రభాకర్

రేపు మంగళవారం మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు హుస్నాబాద్ పట్టణంలో, 10 గంటలకు ఎల్కతుర్తి మండలం సూరారం గ్రామంలో, 11 గంటలకు భీమదేవరపల్లి మండలం ధర్మారం గ్రామంలో కార్యక్రమాల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 12 గంటలకు అక్కన్నపేట మండలం దుబ్బతండా గ్రామపంచాయతీ పరిధిలోని రాజులతండాలో 2.10 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ వివరాలను మంత్రి క్యాంపు కార్యాలయ అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్