ఓటరు జాబితా సవరణను పారదర్శకంగా చేయాలి: మంత్రి పొన్నం ప్రభాకర్

హనుమకొండ జిల్లా, హుస్నాబాద్ నియోజకవర్గం ఎల్కతుర్తి మండలం సూరారం గ్రామంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ - SIR కార్యక్రమాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. BLOలు, BLAలతో మాట్లాడిన మంత్రి, ఓటరు జాబితా సవరణను పారదర్శకంగా, వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. అర్హులైన ప్రతి ఓటరుకు అవకాశం వచ్చేలా ఇంటింటి ఎన్యూమరేషన్ చేపట్టి, ప్రజలకు సహాయం అందించాలని సూచించారు. అనంతరం గ్రామ సర్పంచ్, ప్రజలతో భేటీ అయిన మంత్రి, సూరారం గ్రామ అభివృద్ధి పనులపై చర్చించారు. ప్రజల అభిప్రాయాలు తీసుకుని ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి పనులు చేయాలని అధికారులకు తెలిపారు.

సంబంధిత పోస్ట్