పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు

హుస్నాబాద్ నియోజకవర్గం కోహెడ పోలీస్ స్టేషన్ పరిధిలో వేరువేరు చోట్ల సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీసులు, కోహెడ పోలీసులు గురువారం మెరుపు దాడులు నిర్వహించారు. తంగళ్ళపల్లి గ్రామ శివారులో పేకాట ఆడుతున్నారని నమ్మదగిన సమాచారం మేరకు సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీసులు, కోహెడ పోలీసులు దాడులు నిర్వహించి నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి నుండి రూ. 9390 నగదు, నాలుగు మొబైల్ ఫోన్లు స్వాధీనపరుచుకున్నారు.

సంబంధిత పోస్ట్