హుస్నాబాద్ పట్టణానికి చెందిన బీజేపీ హుస్నాబాద్ పట్టణ మాజీ అధ్యక్షుడు బత్తుల శంకర్ బాబుని బీజేపీ ఎస్సీ మోర్చా తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమిస్తూ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షుడు కొండేటి శ్రీధర్ సోమవారం నియామక పత్రాన్ని అందజేశారు. తక్షణమే వీరి నియామకం అమలులోకి వస్తుందని తెలిపారు. పార్టీ కోసం ఎస్సీల సమస్యలకు ఉదృతంగా పోరాటం చేయాలని తెలిపారు.