సిద్దిపేట: అసెంబ్లీలో శివుడి కుటుంబ ఫోటో ప్రదర్శించిన మంత్రి పొన్నం

తెలంగాణ అసెంబ్లీలో రవాణా, బీసీ సంక్షేమ శాఖల కేటాయింపులపై చర్చ జరుగుతుండగా, మంత్రి పొన్నం ప్రభాకర్ శివపార్వతుల చిత్రపటాన్ని ప్రదర్శించారు. సభలో ఫోటోలు చూపించరాదంటూ ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేయగా, అనుమతి తీసుకున్నానని మంత్రి తెలిపారు. ఇటీవల వేములవాడకు వచ్చిన శృంగేరి పీఠాధిపతి, వైరుధ్యాలున్నా కలిసి ఉండాల్సిన విషయాలను శివుడి కుటుంబ చిత్రం ద్వారా వివరించారని మంత్రి పేర్కొన్నారు. సభలో ఎలాంటి ప్రకార్డులు లేదా గుర్తులు చూపించకూడదని నిబంధనలున్నాయి.

సంబంధిత పోస్ట్