ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలి.. పొన్నం ప్రభాకర్

సిద్దిపేట జిల్లా కోహెడ మండల కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులపై మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. మొదటి విడతలో మంజూరైన ఇళ్ల నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసి గృహ ప్రవేశాలు జరిపించాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని, ఈ విషయాల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తాగునీటి సమస్యలపై కూడా దృష్టి సారించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్