మరికొద్ది సేపట్లో హుస్నాబాద్ కు చేరుకోనున్న ముఖ్యమంత్రి

ప్రజా పాలన ప్రజావిజయోత్సవాల్లో భాగంగా బుధవారం హుస్నాబాద్ పట్టణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపిన వివరాల ప్రకారం, 44.12 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీకి, 58.91 కోట్ల రూపాయల అంచనాతో హుస్నాబాద్ టూ అక్కన్నపేట వరకు ఫోర్ లేన్ రోడ్డుకు, 20 కోట్ల రూపాయల వ్యయంతో మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేస్తారు.

సంబంధిత పోస్ట్