వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, ఎవరూ అధైర్యపడవద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం తెలిపారు. సిద్ధిపేట జిల్లా అక్కన్నపేట మండలం మోత్కులపల్లి వద్ద వరదలో గల్లంతయి మృత్యవాత పడ్డ ముగ్గురి కుటుంబాలను, 8 పశువుల యజమానులను ప్రభుత్వం ఆదుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు. గత నెల 31న ముఖ్యమంత్రితో కలిసి ఏరియల్ సర్వే ద్వారా హుస్నాబాద్ నియోజకవర్గంలో పంట నష్టం, రహదారులు, కల్వర్టుల పరిస్థితిని పరిశీలించినట్లు మంత్రి పేర్కొన్నారు.