తెలంగాణ ఉద్యమకారుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ జేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారుల ర్యాలీ అంబేద్కర్ చౌరస్తా నుండి క్యాంప్ ఆఫీస్ వరకు జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమకారుల గుర్తింపు కమిటీని ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తూనే, ఆ కమిటీ రాజకీయ కమిటీలా ఉందని, అందులో ఉద్యమ సంస్థల ముఖ్యులు, మేధావులను చేర్చాలని డిమాండ్ చేశారు. జేఏసీ కన్వీనర్ కవ్వ లక్ష్మారెడ్డి, కమిటీలో రిటైర్డ్ జడ్జి లేదా ఐఏఎస్, ఐపీఎస్ లను సభ్యులుగా చేర్చాలని సూచించారు.

సంబంధిత పోస్ట్