వార్డు సభ్యులకు శిక్షణ కార్యక్రమం ప్రారంభం

సిద్దిపేట జిల్లా, హుస్నాబాద్‌లోని ధూళిమిట్ట మండలంలో 11 గ్రామ పంచాయతీల నూతన వార్డు సభ్యులకు రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్, తెలంగాణ గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది. ఈ శిక్షణ అక్టోబర్ 3 వరకు కొనసాగనుంది. గ్రామాల అభివృద్ధికి వార్డు సభ్యులు శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ గునుకల లీలా కోరారు. ఈ కార్యక్రమంలో అధికారులు, శిక్షకులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕