హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ ఆదేశాల మేరకు, ఎల్కతుర్తి మండల పార్టీ అధ్యక్షుడు పిట్టల మహేందర్ ఆధ్వర్యంలో ఎల్కతుర్తి బస్టాండ్ కూడలి వద్ద టీఆర్ఎస్ శ్రేణులు నల్ల బ్యాడ్జీలు ధరించి శాంతియుత బైక్ ర్యాలీ నిర్వహించి కాంగ్రెస్ పార్టీ వైఖరికి నిరసన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సిట్ విచారణ పేరుతో చంద్రశేఖర్ రావు గారిని వేధింపులకు గురి చేసేందుకు ప్రయత్నిస్తోందని, దీనికి నిరసనగా ఈ ర్యాలీ చేపట్టామని మండల పార్టీ అధ్యక్షుడు మహేందర్ తెలిపారు. ఈ నిరసన ఎల్కతుర్తి మండల కేంద్రంలోని అన్ని గ్రామాలలో జరిగింది.