హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని చిగురుమామిడి మండలం ఓగులాపూర్ లో రూ. 10 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన వివో మహిళా సమైక్య భవనాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ మంగళవారం ప్రారంభించారు. ఈ భవనం గ్రామ ప్రజల ఐక్యత, మహిళల సాధికారత, గ్రామాభివృద్ధికి కేంద్రబిందువుగా నిలుస్తుందని, మహిళా సంఘాల సమావేశాలు, స్వయం ఉపాధి, శిక్షణా తరగతులు, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన, గ్రామాభివృద్ధి సమావేశాలు ఒకే చోట నిర్వహించుకునే అవకాశం కలుగుతుందని మంత్రి తెలిపారు.