పదవ తరగతిలో అత్యుత్తమ ఫలితాలు సాధించి పేరు తీసుకరావాలి

కోహెడ మండలంలోని శనిగరం ఉన్నత పాఠశాలలో బుధవారం జరిగిన 10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశంలో గ్రామ సర్పంచ్ లింగంపల్లి లక్ష్మయ్య విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. విద్యార్థి జీవితం మధురానుభూతితో కూడుకున్నదని, పాఠశాల జీవితం భవిష్యత్తుకు పునాది అని ఆయన పేర్కొన్నారు. పదవ తరగతిలో అత్యుత్తమ ఫలితాలు సాధించి తల్లిదండ్రులకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్