చంద్రగ్రహణం ఎఫెక్ట్.. కొమురవెల్లి ఆలయం మూసివేత

చంద్రగ్రహణం సందర్భంగా సిద్దిపేట జిల్లాలోని ప్రసిద్ధ పుణ్య క్షేత్రం కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి ఆలయాన్ని మంగళవారం ఉదయం మూసివేశారు. గ్రహణానికి ముందు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం 7.30 గంటలకు ఆలయాన్ని తిరిగి తెరిచి సంప్రోక్షణ, శుద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నారు. అనంతరం భక్తులకు యథావిధిగా దర్శనానికి అనుమతి ఉంటుందని ఆలయ అర్చకులు, కార్య నిర్వాహణాధికారి తెలిపారు.

సంబంధిత పోస్ట్