మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండల కేంద్రంలో 18 నెలల రుచిత అనే చిన్నారి ప్రమాదవశాత్తు ఇంట్లో ఆడుకుంటూ బకెట్లో పడి మృతి చెందింది. తల్లిదండ్రులు స్వప్న, ధనంజయ్ ల కూతురైన రుచిత, ఇంటి దగ్గర ఆడుకుంటుండగా ఈ విషాదం చోటు చేసుకుంది. స్పృహ కోల్పోయిన చిన్నారిని మెదక్ ఆస్పత్రికి తరలించగా, మార్గమధ్యంలోనే మృతి చెందింది. తల్లి స్వప్న రోదనలు అక్కడున్న వారిని కంటతడి పెట్టించాయి.