పోలీసులపై దాడి: ముగ్గురు అరెస్ట్

శుక్రవారం చేగుంట మండల కేంద్రంలో ట్రాఫిక్ జామ్ కారణంగా పోలీసుల విధులకు ఆటంకం కలిగించి, దాడికి పాల్పడిన ముగ్గురు నిందితులను శనివారం చేగుంట పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. రాంగ్ రూట్‌లో వచ్చిన కారుతో ట్రాఫిక్ జామ్ ఏర్పడగా, అంబులెన్స్ కూడా చిక్కుకుంది. ట్రాఫిక్ క్లియర్ చేస్తున్న పోలీసులపై కారు డ్రైవర్ విజయ్ కృష్ణతో పాటు మరో ఇద్దరు దాడి చేసి, పోలీసుల ట్యాబ్‌ను ధ్వంసం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై చైతన్య కుమార్ రెడ్డి తెలిపారు.

సంబంధిత పోస్ట్