మెదక్ జిల్లా ఎస్సీ సెల్ సెక్రటరీ అనిల్ అనుమానాస్పదంగా మృతి చెందాడు. మెదక్-హైదరాబాద్ హైవే పక్కన కారులో అనిల్ మృతదేహం కనిపించింది. మొదట ఇది రోడ్డు ప్రమాదంగా భావించిన పోలీసులు, బుల్లెట్లు లభించడంతో దర్యాప్తు కోణం మార్చారు. అనిల్ శరీరంపై బుల్లెట్ గాయాలు ఉన్నాయి. బంధువులు హత్యగా అనుమానిస్తున్నారు. హత్యా? ఆత్మహత్యా? లేక ప్రమాదమా?