భర్త మరణంతో కుంగిపోయి.. కొడుకుతో సహా ఆత్మహత్య చేసుకున్న వివాహిత

మెదక్‌ జిల్లా చిన్నశంకరంపేట మండలం ఖాజాపూర్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. భర్త ప్రవీణ్‌గౌడ్ అనారోగ్యంతో మృతి చెందడంతో కుంగిపోయిన అఖిల (25), తన రెండేళ్ల కుమారుడు శ్రీయాన్‌గౌడ్‌తో కలిసి బలవన్మరణానికి పాల్పడింది. అత్తామామలు మరో వివాహం చేసుకోమని సూచించినా ఆమె అంగీకరించలేదు. మంగళవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో కొడుకును ఉరేసి, తాను ఉరేసుకుంది. కుమారుడు శ్రీయాన్‌ను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అఖిల మేనమామ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్