కాలుజారి చెరువులో పడి మల్లేశం మృతి

నిజాంపేట మండలం బచ్చురాజ్‌పల్లి గ్రామానికి చెందిన బోడపట్ల మల్లేశం (38) చెరువులో శనివారం స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు కాలుజారి లోతైన నీటిలోకి వెళ్లి మునిగి మృతి చెందాడు. ఈ ఘటనలో ఊపిరాడక మరణించినట్లు గ్రామస్థులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది.

సంబంధిత పోస్ట్