హైదరాబాద్ నుంచి స్వగ్రామం తుజాల్‌పూర్‌కు వెళ్తున్న చాకలి రాజు (42) నిజాంపేట మండల కేంద్రంలో అకస్మాత్తుగా మూర్ఛ రావడంతో కిందపడి మృతి చెందాడు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని గ్రామానికి తరలించారు. రాజు ఆకస్మిక మరణంతో తుజాల్‌పూర్ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు.