మెదక్: రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి: కలెక్టర్

రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని మెదక్ కలెక్టర్ రాహుల్ రాజు అన్నారు. మెదక్ మండలం పేరూరు గ్రామంలో పంట పొలాలను సోమవారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ రైతులు యాజమాన్య పద్ధతులు పాటించాలని సూచించారు. పంట దిగుబడి కోసం వ్యవసాయ శాఖ అధికారులు సూచనలు పాటించాలని చెప్పారు. ఎరువులు, యూరియా నిలువలు ఉన్నాయని, రైతులు అధైర్యపడవద్దని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్