మెదక్: ఆర్థిక ఇబ్బందులతో హోటల్ యజమాని సూసైడ్

మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లి పారిశ్రామిక వాడలో ఆర్థిక ఇబ్బందులతో బోడి జయరాం అనే హోటల్ యజమాని ఆత్మహత్య చేసుకున్నారు. ఇటీవల హోటల్ వ్యాపారం సరిగా నడవకపోవడం, భాగస్వాములతో విభేదాలు, కుటుంబ సమస్యల కారణంగా మనస్తాపంతో ఆయన హోటల్ గదిలో ఉరివేసుకున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తూప్రాన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సుభాష్ గౌడ్ తెలిపారు.

సంబంధిత పోస్ట్