మెదక్: మేనేజర్ వేధింపులు.. ఉద్యోగి మృతి

మెదక్ పట్టణంలో విశాల్ మార్ట్ మేనేజర్ కిరణ్ వేధింపులకు గురైన దుర్గా ప్రసాద్ (21) అనే ఉద్యోగి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. పని ఒత్తిడి పెంచుతూ వేధిస్తున్నారని, ఉద్యోగం పోతుందన్న భయంతో దుర్గా ప్రసాద్ భరించాడని కుటుంబ సభ్యులు తెలిపారు. మేనేజర్ నిర్లక్ష్య ధోరణి వల్లే ఈ ఘటన జరిగిందని ఆరోపించారు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం దుర్గా ప్రసాద్ మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

సంబంధిత పోస్ట్