మెదక్: విద్యుత్ షాక్‌తో శ్రీను స్పాట్ డెడ్

కొల్చారం మండలం అంసన్ పల్లిలో విద్యుత్ షాక్ తో రైతు మలావత్ శ్రీను (44) బుధవారం సాయంత్రం మృతి చెందాడు. వ్యవసాయ భూమి కౌలుకు తీసుకొని సాగు చేస్తున్న శ్రీను, మోటార్ స్టార్టర్ రిపేర్ చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతానికి గురై అక్కడికక్కడే మరణించాడు. మృతుని భార్య దేవులి ఫిర్యాదు మేరకు కొల్చారం పోలీసులు కేసు నమోదు చేసుకొని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై మొహమ్మద్ మొయినుద్దీన్ తెలిపారు.

సంబంధిత పోస్ట్