మెదక్ పట్టణంలోని మెడికల్ కళాశాల వద్ద చంద్ర భవన్ కాంప్లెక్స్ లో వినాయకుడి విగ్రహాన్ని దొంగిలించిన విచిత్ర సంఘటన జరిగింది. ఈ విగ్రహాన్ని ఒక వాహనంలో తీసుకెళ్తుండగా సీసీ కెమెరాలో దృశ్యాలు రికార్డయ్యాయి. దాంతో చోరీ విషయం వెలుగులోకి వచ్చింది. నిరుద్యోగి ఎర్రోళ్ల సురేశ్ ఈ విగ్రహాలను తీసుకువచ్చి విక్రయిస్తున్నాడని తెలిసింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఆశ్చర్యపోయారు.