మెదక్: తోటి కోడలు తిట్టిందని.. మహిళ ఆత్మహత్య

మెదక్ మండలం మాచవరంలో కుటుంబ కలహాలు విషాదంగా ముగిశాయి. ఇంటి ఆవరణ విషయంలో తోటి కోడలు సంగీతతో జరిగిన గొడవ తరువాత, ఆమె కుటుంబ సభ్యులు వచ్చి లలిత (49)ను తిట్టటంతో మనస్తాపానికి గురై ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. భర్త రాజయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్