చిన్న శంకరంపేట మండలంలోని ఖాజాపూర్ గ్రామంలో మంగళవారం అఖిల (24) తన రెండేళ్ల కుమారుడు రియాన్స్ గౌడ్ తో కలిసి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషాదకర సంఘటన చోటుచేసుకుంది. భర్త ఏడాది క్రితం మృతి చెందడంతో తల్లిగారింట్లో ఉన్న అఖిల, సోమవారం అత్తగారితో కలిసి ఖాజాపూర్ లోని తన ఇంటికి వచ్చింది. మంగళవారం ఉదయం ఇంట్లో తలుపులు పెట్టుకున్న అఖిల, చుట్టుపక్కల వారి సహాయంతో తలుపులు తీయగా, తల్లి, కొడుకు ఉరి వేసుకుని కనిపించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం మెదక్ తరలించారు.