బియ్యం లారీకి తప్పిన ప్రమాదం

రామాయంపేట ఎఫ్‌సీఐ గోదాం నుంచి దంతేపల్లికి బియ్యం తరలిస్తున్న లారీ క్యాట్రియాల గ్రామ శివారులో అదుపుతప్పి కుదుపుకు గురైంది. రహదారి దెబ్బతినడంతో లారీ ఒక్కసారిగా పక్కకు ఒరిగి, బియ్యం సంచులు రోడ్డుపై పడ్డాయి. అదృష్టవశాత్తు ఆ సమయంలో వాహనాలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సిబ్బంది వెంటనే స్పందించి, కిందపడ్డ సంచులను తిరిగి లారీలో ఎక్కించి, వాహనాన్ని గమ్యస్థానానికి తరలించారు.

సంబంధిత పోస్ట్