ఆ ప్రవేశాలకు ఆహ్వానం

ఉమ్మడి మెదక్ జిల్లాలోని MJP బీసీ గురుకుల డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు మే 10 వరకు గడువు పొడిగించినట్లు రీజినల్ కోఆర్డినేటర్ రాజేశం తెలిపారు. సంగారెడ్డి, మెదక్, వర్గల్ కేంద్రాల్లో ఈ కళాశాలలు ఉన్నాయి. ఇంటర్ ఉత్తీర్ణులైన విద్యార్థులు వెబ్‌సైట్‌లో రూ.200 చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. మరిన్ని వివరాలకు 04023328266 ను సంప్రదించవచ్చు.

సంబంధిత పోస్ట్