రామాయంపేట మండలం ఆర్. వెంకటాపూర్ గ్రామంలో శనివారం అంజయ్య ఇంట్లో అగ్నిప్రమాదం సంభవించింది. ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లిన అంజయ్య, తిరిగి వచ్చేలోపే ఇంట్లో నుంచి పొగలు రావడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, టీవీ నుంచి షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో భారీ నష్టం తప్పింది.