పోలంపల్లి శివారులో అనుమానాస్పద మృతదేహం

చేగుంట మండలంలోని పోలంపల్లి గ్రామ శివారులో రోడ్డుపక్కన గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కనిపించడంతో స్థానికంగా కలకలం రేగింది. గ్రామస్థులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి, మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు ఎవరు, మృతికి గల కారణాలు ఏమిటనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్