తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు

కొడుకు చేయాల్సిన చివరి కర్మను కూతురు నిర్వహించారు. తండ్రి మరణంతో కుమారుడి స్థానంలో నిలిచి తలకొరివి పెట్టి అంతిమ సంస్కారాలు నిర్వహించిన ఘటన నిజాంపేట మండల కేంద్రంలో చోటుచేసుకుంది. నాళం రాజగౌడ్‌ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి శుక్రవారం అర్ధరాత్రి మృతి చెందారు. ఆయన కుమారుడు తిరుపతి పదేళ్ల క్రితమే అనారోగ్యంతో మృతిచెందారు. దీంతో వారసుడు లేకపోవడంతో పెద్ద కుమార్తె, రామాయంపేట సొసైటీ వైస్‌ చైర్మన్‌ సులోచన తండ్రికి తలకొరివి పెట్టారు. తండ్రి చివరి కోరికను కన్నీళ్లతో నెరవేర్చిన కుమార్తెను చూసి పలువురు కంటతడి పెట్టారు.

సంబంధిత పోస్ట్

✕
✕