లోడుతో వెళ్తూ అదుపుతప్పిన ట్రాక్టర్

బుధవారం చేగుంట మండల పరిధిలోని వడియారం గ్రామ శివారులో లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. చేగుంట నుంచి రామంతపూర్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనతో రహదారిపై రాళ్లు చెల్లాచెదురుగా పడిపోయి, కొంతసేపు భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. స్థానికులు జేసీబీ సహాయంతో ట్రాక్టర్ ట్రాలీని పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.

సంబంధిత పోస్ట్