వారాంతపు సంతకు వెళ్తూ విషాదం.. ప్రాణాలు కోల్పోయిన తల్లి

రామాయంపేట మండలం అక్కన్నపేట శివారులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కామారెడ్డి జిల్లా బస్వాపూర్ గ్రామానికి చెందిన పూసల బాలరాజు భార్య మంజుల అక్కడికక్కడే మృతి చెందింది. బాలరాజు తన కుటుంబంతో కలిసి వారాంతపు సంతలో చిరు వ్యాపారం చేసుకునేందుకు ఆటోలో వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో బాలరాజు కుమారుడు అభి, కూతురు పావనికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్