పాపన్నపేట మండలం యూసుఫ్‌పేటలో మద్యం అలవాటు విషయంలో భార్యాభర్తల మధ్య తలెత్తిన వివాదం కారణంగా ఎర్ర అశోక్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. తీవ్ర ఆవేదనకు గురైన అశోక్ గదిలోకి వెళ్లి తలుపు మూసుకున్నాడు. కుటుంబ సభ్యులు గమనించి అతన్ని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.