ఉప ముఖ్యమంత్రిని కలిసిన రాయికోడ్ మార్కెట్ కమిటీ చైర్మన్

ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్కను కలిసిన రాయికోడ్ మార్కెట్ కమిటీ చైర్మన్, రాయికోడ్ ఎఎంసి చైర్మన్ మంతూరి సుధాకర్ రెడ్డి సోమవారం తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన ఉప ముఖ్యమంత్రిని శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ భేటీలో భాగంగా మార్కెట్ కమిటీ పరిధిలోకి వచ్చే మునిపల్లి మరియు రాయికోడ్ మండలాల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని ఉప ముఖ్యమంత్రికి వివరించారు. నియోజకవర్గంలో చేపట్టాల్సిన తదుపరి అభివృద్ధి కార్యక్రమాలపై ఆయనతో చర్చించారు. ఈ కార్యక్రమంలో నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డితో పాటు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్