కంగ్టి: బైక్ అదుపుతప్పి ముగ్గురికి గాయాలు

బుధవారం కంగ్టి మండలం బోర్గి గ్రామ శివారులో గోవిందరావు, సంజీవ్, లక్ష్మణ్ అనే ముగ్గురు ఒకే బైక్‌పై కంటికి వెళ్తుండగా, మార్గమధ్యంలో అకస్మాత్తుగా అడ్డువచ్చిన కుక్కను తప్పించబోయి అదుపుతప్పి కింద పడ్డారు. ఈ ప్రమాదంలో ముగ్గురికీ గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే చికిత్స కోసం కంగ్టి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.

సంబంధిత పోస్ట్