ఖేడ్: తాళం వేసిన ఇంట్లో నాలుగున్నర తులాల బంగారం చోరీ

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలోని సాయిబాబా కాలనీలో శనివారం రాత్రి దొంగతనం జరిగింది. సాయిబాబా కాలనీ లో రమేష్ ఇంటికి తాళం వేసి వినాయక నిమజ్జనానికి జూకల్ గ్రామానికి వెళ్ళాడు. దీంతో గుర్తు తెలియని దొంగలు ఇంట్లోకి ప్రవేశించి ఇంటి తాళం పగలగొట్టి బీరువాలో ఉన్న నాలుగున్నర తులాల బంగారం, ఒక లక్ష 25 వేల నగదు అపహరించుకుని వెళ్లారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. క్లూస్ టీం అధికారులు విచారిస్తున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕