నల్లవాగు అభివృద్ధి, నీళ్ల కొరత తీర్చేందుకు సింగూర్ జలాశయం నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ చేపట్టేందుకు రూ. 70 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశామని నారాయణఖేడ్ ఎమ్మెల్యే డా. పట్లోళ్ల సంజీవరెడ్డి తెలిపారు. ఆయన మాట్లాడుతూ మంజీరా నదిపై లిఫ్ట్ ఇరిగేషన్ పథకం పూర్తయితే సింగూర్ లో నీళ్లు ఉంటే నల్లవాగులో నీళ్లు ఉన్నట్లేనని అన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా నల్లవాగు పరివాహక రైతులకు సాగునీరు పుష్కలంగా అందుతుందన్నారు. అదేవిధంగా కల్హేర్, మార్డి, ఇంద్రానగర్ గ్రామాలకు నిరంతర తాగునీటి సరఫరా కోసం కూడా లిఫ్ట్ ఇరిగేషన్ కార్యక్రమాన్ని చేపడతామని ఎమ్మెల్యే తెలిపారు. నియోజకవర్గంలో సాగు, తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటున్నారు.