సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలోని ర్యాకల్ రోడ్ వద్ద గల ఎంఏ మొబైల్ షాప్ లో పట్టపగలే మొబైల్ చోరీ జరిగింది. షాప్ యజమాని వాపోవడంతో తెలుస్తున్న వివరాల ప్రకారం, షాప్ లో ఉన్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి సుమారు రూ. 22,000 విలువగల వన్‌ప్లస్ మొబైల్ ఫోన్ ను అపహరించి పరారయ్యాడు. దొంగతనంపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.