వెల్దుర్తి మండలం ఉప్పు లింగాపూర్‌లో ధాన్యం కొనుగోళ్లు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ రైతులు మెదక్-వెల్దుర్తి ప్రధాన రహదారిపై ఆందోళనకు దిగారు. రోడ్డుపై ధాన్యం బస్తాలు పేర్చి గ్యాస్ సిలిండర్‌తో వంట వార్పు నిర్వహిస్తూ నిరసన తెలిపారు. నెల రోజులుగా కొనుగోలు కేంద్రాల వద్ద ఎదురుచూస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం బస్తాలకు నిప్పంటించారు.