మనోహరాబాద్ లో భారీ రోడ్డు ప్రమాదం

మనోహరాబాద్ మండలంలో భారీ రోడ్డు ప్రమాదం కలకలం రేపింది. దండుపల్లి గ్రామ సమీపంలోని ఐటీసీ వద్ద 44వ జాతీయ రహదారిపై యూటర్న్ తీసుకుంటున్న ఓ భారీ లారీని మరో వేగంగా దూసుకొచ్చిన లారీ ఢీకొట్టింది. ఘర్షణ ప్రభావంతో రెండూ లారీలు బోల్తా పడ్డాయి. ఈ ప్రమాదంలో రెండు లారీల డ్రైవర్లు, క్లీనర్లు తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానికులు వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్