మంగళవారం ఉదయం కౌడిపల్లి మండలం దేవులతండా సమీపంలో లారీ-ఆటో ఢీకొన్న ఘటనలో మేడ్చల్ జిల్లాకు చెందిన పిట్టల నాగార్జున (33) అక్కడికక్కడే మృతి చెందాడు. మామిడి తోటలో కూలి పనులకు వెళ్తున్న అన్నదమ్ములు ఈ ప్రమాదానికి గురయ్యారు. తీవ్రంగా గాయపడిన అన్న అనిల్ ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నాడు. ఈ దుర్ఘటన వారి కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది.