సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం మండల కేంద్రంలోని అక్కమ్మ చెరువు గట్టు పక్కన శుక్రవారం సాయంత్రం విద్యుత్ స్తంభం రోడ్ పై పడింది. చెరువు గట్టు పక్కన కోతుల మంద పెద్ద ఎత్తున చెట్టును ఊపుతూ విద్యుత్ వైర్లపై పడడంతో ఒక్కసారిగా విద్యుత్ స్తంభం రోడ్డుపై పడింది. ఇది గమనించిన స్థానికుడు లక్ష్మణ్ విద్యుత్ అధికారులకు సమాచారం అందించారు. కోతుల సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.