సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు మండలం పాశమైలారం పారిశ్రామికవాడలోని ఎన్విరోవేస్ట్ మేనేజ్మెంట్ పరిశ్రమలో అగ్నిప్రమాదం ఆదివారం చోటుచేసుకుంది. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. లారీ, జేసీబీ మంటల్లో తగలబడుతుంది. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కాగా ఈ సంఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.