లారీ ఢీకొని బైక్​పై వ్యక్తి మృతి: స్థానికుల ఆందోళన

తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కేసీఆర్ నగర్ సమీపంలో ఓ లారీ అదుపుతప్పి బైక్‌ను ఢీకొన్న ఘటనలో బైక్ రైడర్ అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ రోడ్డుపై తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయని, భారీ వాహనాల వేగం అదుపులో లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్