ఈ నెల 11న పటాన్‌చెరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో అనిల్ కుమార్ అనే వ్యక్తి గాయపడ్డారు. అతనిని చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తరలించగా, సోమవారం చికిత్స పొందుతూ మృతిచెందినట్లు ఎస్‌ఐ శ్రీశైలం తెలిపారు. మృతుడి ఊరు ఒంగోలు అని సమాచారం. అతన్ని ఎవరు గుర్తుపట్టినా, దయచేసి పటాన్‌చెరు పోలీస్ స్టేషన్‌ను సంప్రదించమని కోరారు.