సంగారెడ్డి: సిగాచి ప్రమాదం.. బాధిత కుటుంబాలకు రూ.15 లక్షల సాయం

సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో పేలుడు సంభవించి 44 మంది మరణించిన సంగతి తెలిసిందే. కాగా ఆచూకీ లభించని 8 మంది కార్మికులు మరణించినట్టు నేడు అధికారులు ప్రకటించారు. ఈ క్రమంలోనే సంగారెడ్డి అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ నేతృత్వంలోని అధికారులు ఈ కుటుంబాలకు రూ.15 లక్షల తక్షణ ఆర్థిక సహాయం అందజేయాలని నిర్ణయించారు. మరణ ధృవీకరణ పత్రాలు, ఎక్స్‌గ్రేషియా చెల్లింపులను మూడు నెలల్లో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్