సంగారెడ్డి: ప్రమాదవశాత్తు నీట మునిగి ఓ వ్యక్తి మృతి

సంగారెడ్డి జిల్లా చింతకుంట గ్రామానికి చెందిన అన్నాసాగర్ లక్ష్మయ్య (85) అనే వృద్ధుడు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 13న పొలానికి వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. అతని ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం ఎనికేపల్లి గ్రామ శివారులోని మంజీరా నదిలో గుర్తు తెలియని మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు పరిశీలించి, మృతుడు లక్ష్మయ్యగా గుర్తించారు. కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లి నదిలో కొట్టుకుపోయాడని భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మెదక్ జిల్లా ఆస్పత్రికి తరలించి, మృతుడి కొడుకు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

సంబంధిత పోస్ట్