సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ సమీపంలో ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు 30 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బీదర్ నుంచి నారాయణఖేడ్ వైపు తరలిస్తున్న చావాన్ ప్రభు, రాథోడ్ పర్లాల్ అనే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ఒక మొబైల్ ఫోన్ కూడా స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ అంతర్జాతీయ మార్కెట్లో సుమారు 15 లక్షల రూపాయలు ఉంటుందని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. నిందితులను తదుపరి చర్యల కోసం నారాయణఖేడ్ ఎక్సైజ్ స్టేషన్‌కు తరలించారు.